టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం

Dasari Kiran Kumar Appointed TTD Board Member. టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.

By Medi Samrat
Published on : 16 Dec 2022 8:02 PM IST

టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం

టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ గా పూర్తి అదనపు భాద్యతలను నిర్వహిస్తున్న ఎం. హరి జవహర్ లాల్ జీఓ జారీ చేశారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్ (పిల్) సంఖ్య. 203/2021 ఫలితానికి లోబడి ఈ నియామకం జరిగినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. టీటీడీ బోర్డుకి ఇప్పటికే 23 మంది సభ్యులుండ‌గా.. ఇప్పుడు 24వ సభ్యుడిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ ప్ర‌భుత్వం కీల‌క‌ ఉత్తర్వులు జారీ చేసింది. సినీ పరిశ్రమ నుంచి గ‌తంలో చాలామందికి ఈ పదవి లభించింది. దాస‌రి కిర‌ణ్ కుమార్ టాలీవుడ్‌లో పేరున్న నిర్మాత‌. ఆయ‌న నిర్మాత‌గా ప‌లు సినిమాలు నిర్మించారు. రామ్‌లీల‌, సిద్ధార్థ‌, జీనియ‌స్‌, వంగ‌వీటి, వ‌స్తా.. నీవెన‌క వంటి చిత్రాల‌ను నిర్మించారు.


Next Story