శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జ‌గ‌న్‌

CM YS Jagan Presented Silk Clothes to Lord Venkateswara. శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్

By Medi Samrat  Published on  11 Oct 2021 8:37 PM IST
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జ‌గ‌న్‌

శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా సీఎం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్క‌డ‌ ఆలయ అర్చకులు ముఖ్య‌మంత్రికి పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆల‌యానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు.

దర్శనానంతరం సీఎం జ‌గ‌న్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్ అందజేశారు. అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి. సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story