తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇలా ఎందుకు జరిగింది?" "టోకెన్లు ఎప్పుడు ఇస్తామని చెప్పారు? ఏ సమయంలో ఏర్పాట్లు చేసారు? దానికి మీరు సమాధానం చెప్పాలి? అంటూ పలు ప్రశ్నలు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. 2,000 మంది మాత్రమే పట్టే చోట.. 4,500 మందిని ఎందుకు అనుమతించారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
టీటీడీ ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, గేటు తీసిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని టీటీడీ ఈవో చెప్పారు. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలియదా? పరిమితికి మించి భక్తులను ఎలా అనుమతించారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని ప్రశ్నించారు. ఏమీ జరగక ముందే చర్యలు తీసుకుంటే దాన్ని అడ్మినిష్ట్రేషన్ అంటారని, ప్రమాదం జరిగిన తర్వాత ఎంత చేస్తే మాత్రం ఏం ఉపయోగమని సీఎం చంద్రబాబు అన్నారు.