టీటీడీకి రూ.30 లక్షల విరాళం అందించిన చంద్రబాబు కుటుంబం

Chandrababu Naidu’s family donates Rs 30 lakh to Tirupati on occasion of grandson's birthday. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు మనవడు, నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్

By Medi Samrat  Published on  21 March 2022 10:30 AM IST
టీటీడీకి రూ.30 లక్షల విరాళం అందించిన చంద్రబాబు కుటుంబం

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు మనవడు, నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును కుటుంబం ఘనంగా జరుపుకొంటోంది. దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా సోమవారం తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం జరగనుంది. టీటీడీ అన్నదానం పథకానికి ఒక్క రోజు అయ్యే మొత్తం ఖర్చును విరాళంగా ఇచ్చింది చంద్రబాబు కుటుంబం. ఏటా దేవాన్ష్‌ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే వ్యయం రూ. 30లక్షలను విరాళంగా ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో ఈ ఏడాది ఆ విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీకి చంద్రబాబు కుటుంబం కోరింది. సోమవారం తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో 'టుడే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌' అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరుపతిలోని తిరుమల కొండల్లోని వేంకటేశ్వరుని కొలువులో ప్రతి సంవత్సరం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి మనవడి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారు. TTD ట్రస్ట్, విరాళాలతో ప్రపంచ దేశాల నుండి వచ్చే వేలాది మంది భక్తుల కోసం అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ప్రతి రోజూ ఏర్పాటు చేస్తుంది.











Next Story