Cancellation of Purnami Garudaseva on 4th June. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 4వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.
By Medi Samrat Published on 3 Jun 2023 2:45 PM GMT
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 4వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం కారణంగా పౌర్ణమి గరుడసేవ జరగదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.