టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఏవీ ధర్మారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం కొట్టివేసింది. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి.. ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్)కి చెందినవాడని, ఆయన నిర్వహిస్తున్న పదవి జిల్లా కలెక్టర్‌తో సమానం కాదని పేర్కొంటూ కో వారెంటో రిట్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తీర్పు చెప్పారు.
ధర్మారెడ్డి డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్‌లో జాయింట్ సెక్రటరీగా పనిచేశారని, ఇది రాష్ట్ర సర్వీస్‌లో సెక్రటరీ పోస్టుతో సమానమని, అదే సమయంలో కలెక్టర్ పోస్టు కంటే ఉన్నతంగా పరిగణించబడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ కంటే ఉన్నతమైన పోస్టులో నియమించేందుకు అన్ని అర్హతలు ఉన్నందున ధర్మారెడ్డిని టీటీడీ ఈఓగా నియమించవచ్చు. ఈ మేరకు బొప్పూడి కృష్ణమోహన్ తీర్పు వెలురించారు. ఎండోమెంట్స్ చట్టం సెక్షన్ 107 ప్రకారం, అఖిల భారత సర్వీసులతో సహా కేంద్ర, రాష్ట్ర సర్వీసులకు చెందిన ఏ అధికారినైనా ఈవోగా నియమించవచ్చు.