28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలను నవంబరు 28 నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారులను ఆదేశించారు.

By Medi Samrat  Published on  22 Nov 2024 1:30 PM GMT
28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలను నవంబరు 28 నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన పంచ‌మి తీర్థం రోజు భ‌క్తుల‌కు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌ని ఈవో ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్ల‌లో ఉండే వేచి ఉండే భక్తుల‌కు మంచినీరు, అల్పాహారం అందించాలన్నారు. ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని స్థానిక పంచాయ‌తీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.

వైద్య విభాగం అధికారులు ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాల‌ను, అంబులెన్సుల‌ను ఏర్పాటు చేసి అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాల‌ను, అవ‌స‌ర‌మైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశాంచారు. భక్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదం విరివిగా అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా నిర్వ‌హించే స్టేజ్ కార్య‌క్ర‌మాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నాణ్య‌మైన‌విగా ఉండాల‌ని సూచించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో వైట్ వాష్‌, క‌ల‌ర్ పెయింటింగ్‌, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

Next Story