తిరుపతి లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తుకు బ్రేక్

తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుందనే ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు బ్రేక్ పడింది

By Medi Samrat  Published on  1 Oct 2024 3:55 PM IST
తిరుపతి లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తుకు బ్రేక్

తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుందనే ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు బ్రేక్ పడింది. అక్టోబరు 3న తదుపరి సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణను నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం విచారణ పూర్తీ అవ్వకముందే మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏమిటంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించింది.

లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ధర్మాసనం విచారణను 3వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా వద్దా అనే విషయంపై కూడా స్పందిస్తామని తెలిపింది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్‌ దర్యాప్తు ను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు.

Next Story