తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  27 May 2024 7:56 AM IST
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు నెల్లూరుకు చెందిన వారిగా గుర్తింపు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story