మీరు తిరుపతి వెలుతున్నారా..? అయితే.. ఇకపై అక్కడ హారన్‌ కొట్టడం నిషేదం. తిరుమలలో శబ్ధ కాలుష్యాన్ని నివారించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పవిత్రమైన తిరుమలలో ఇకపై 'నో హారన్'‌ జోన్‌ను అమలు చేస్తామని తిరుపతి అర్భన్‌ ఎస్పీ రమేష్‌ రెడ్డి తెలిపారు. తిరుమలలో ఇకపై ఎవరూ కూడా హారన్‌ కొట్టకూడదని.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుణ్యక్షేత్రంలో గోవింద నామస్మరణలు, మంత్రోచ్ఛారణలు వినిపించాలే తప్ప ఇతర శబ్దాలు కాదు అన్నారు.

కొండకు చేరుకున్న భక్తులు పాదరక్షలు తీసి ఎలా నడుస్తారో.. అలాగే స్వీయ నియంత్రణతో వాహనాల హార్లను వినియోగించకూడదని కోరారు. అటు భవిష్యత్తులో తిరుపతి నగరాన్ని కూడా నో హారన్ జోన్ లోకి తీసుకొస్తామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. నో హారన్‌ విధానం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కార్యాలయాలు అధికంగా ఉన్న చోట శబ్దాల వల్ల వారి పనులకు ఆటంకం కలగకుండా నో హారన్‌ జోన్‌గా ప్రకటిస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో మరింత మందికి దర్శనం కల్పించే వెసులుబాటు ఉండటంతో అదనపు కోటాను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. రోజుకు మూడు వేల టికెట్ల చొప్పున.. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు సంబంధిత టికెట్లన్నింటిని టీటీడీ విక్రయించింది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story