318 మంది జర్నలిస్టుల హత్యలు.. వాటిలో 222 హత్యలు మిస్టరీయే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 11:41 AM GMT
318 మంది జర్నలిస్టుల హత్యలు.. వాటిలో 222 హత్యలు మిస్టరీయే..?

వాషింగ్టన్‌: ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి..వాటి పరిష్కారం కోసం కృషిచేసే జర్నలిస్టులు..తమ విధి నిర్వహణ కారణంగా ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల హత్యలు పెరిగాయని యునెస్కో పేర్కొంది. పదేళ్ల కాలంలో 318 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారు. 13 దేశాల్లో 222 మంది జర్నలిస్టుల హత్యలు ఇప్పటికీ మిస్టరీగానే మిగాలాయి. పరిశోధనాత్మక జర్నలిస్టుల అణచివేతలో భాగంగానే హింసకు పాల్పడుతున్నట్టు కమిటీ టూ ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్ తెలిపింది.

ముఖ్యంగా జర్నలిస్టులో హత్యలలో వరుసగా ఏడో సారి సోమాలియా అగ్రభాగన ఉంది. ఇక్కడ 25 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారు. కానీ..ఇప్పటికీ ఆ కేసులను అధికారులు ఛేదించలేక పోయారు. కాగా.. సిరియా దేశం రెండో స్థానంలోఉండగా..ఇరాక్‌ మూడో స్థానంలో ఉంది. ఇంకా.. దక్షిణ సూడాన్‌, అప్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, బ్రెజిల్, బంగ్లాదేశ్‌, రష్యా, నైజీరియాలలో జర్నలిస్టులకు విధుల నిర్వహణ కత్తిమీద సాముగా మారింది. ఇక భారత్‌ గత ఐదేండ్లలో భారత్‌లో 18 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

Next Story