కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏడాది పాటు వారి వేతనాల్లో..

By Newsmeter.Network  Published on  9 April 2020 10:56 AM GMT
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏడాది పాటు వారి వేతనాల్లో..

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఈ వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే 5,734 మందికి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో 166 మంది మృత్యువాత పడ్డారు. కరోనా ప్రభావంతో రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈవైరస్‌ వ్యాప్తిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారత్‌లో ముందస్తుగానే లాక్‌డౌన్‌ విధించింది. మార్చి 24నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని సంస్థలు మూతపడ్డాయి. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఆస్పత్రులు, మెడికల్‌ దుకాణాలు మాత్రమే తెరుచుకొనేందుకు అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. రావాల్సిన ఆదాయం రాకపోవటంతో ప్రభుత్వాలు ఆర్థికంగా దెబ్బతింటున్నారు.

Also Read :కరోనా వైరస్‌ను రాజకీయం చేయొద్దు

ఇప్పటికే తెలంగాణలో ఏప్రిల్‌ మొదటివారంలో రూ. 2,400 కోట్లు రావాల్సిన ఆదాయం కేవలం రూ.6కోట్లు మాత్రమే వచ్చింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆరే స్వయంగా వెల్లడించారు. అప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులు, ఏ, బీ తరగతుల ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. సీఎం కేసీఆర్‌ బాటలోనే ఏపీ, మహారాష్ట్ర పలు రాష్ట్రాలు నడిచాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల జీతాల్లో 30శాతం కోత విధించనుంది. ఇది ఒకటి రెండు నెలలకు కాదు.. ఏకంగా ఏడాది పాటు ఈ కోత కొనసాగనుంది. ఈ మేరకు కర్ణాటక క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో వచ్చే ఏడాది మార్చి వరకు నెలకు 30శాతం వేతనాల్లో కోతవిధిస్తున్నట్లు కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేయనున్నట్లు పేర్కొనారు.

Also Read :మైనర్‌ బాలుడిపై పోలీసుల దాష్టీకం..

Next Story