ఎన్నారైల కోసం దేవదాయ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌..!

By అంజి  Published on  7 Dec 2019 10:05 AM IST
ఎన్నారైల కోసం దేవదాయ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌..!

ముఖ్యాంశాలు

  • కోరుకున్న తేదీన పూజను జరిపించనున్న ఆలయ పూజారి
  • భక్తులకు ప్రసాదం పంపేందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన

అమరావతి: విదేశాల్లో ఉంటున్న తెలుగు వాళ్లకు మన దేవుళ్లు, ఆచరాలు, సంప్రదాయాలు అంటే ఎంతో నమ్మకం. గతంలో ప్రతి ఏటా ఎంతో మంది భక్తులు విదేశాల నుంచి దైవ దర్శనానికి వచ్చేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి.. పరిస్థితులు మారిపోవడంతో భక్తులు దేవాలయాల్లో పూజ చేయించుకోలేకపోతున్నారు. ఏటా కుటుంబ సమేతంగా స్వరాష్ట్రంలోని ఆలయాల్లో స్వామివారికి పూజలు చేయించడం కాని పని. ఒకవేళ స్వామి వారికి పూజలు చేయకపోతే పనులు సరిగా సాగవేమోనన్న భయం కొందరు భక్తులకు వెంటాడుతుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం ఎన్నారైల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైల ప్రత్యేక సేవలు ప్రారంభించాలని రాష్ట్ర దేవదాయ శాఖ నిర్ణయించింది.

ఎవరైనా... దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా.. మీకు ఇష్టమైన సందర్భాల్లో మీ ఇష్టదైవం ఆలయంలో పూజ, అర్చన, ఇతర కార్యక్రమాలు చేయించుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దేవదాయశాఖ ప్రణాళికలు రచిస్తోంది. భక్తుడు ఎక్కడున్నా.. కోరుకున్నా తేదీన ఆలయ పూజారి పూజను జరిపిస్తారు. ఇప్పుడు ఎన్నారై భక్తుల కోసం దేవదాయశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. అన్ని దేవాలయాల సేవల్ని ఒక చోట అందుబాటులోకి తీసుకురానుంది. ఆలయాల్లో పూజలు జరిపించుకునే ఎన్నారైల నుంచి కనీస ధరకు అదనంగా కొంత మొత్తాన్ని అధికారులు సర్వీసు ఛార్జ్‌ రూపంలో తీసుకుంటారు. స్వామివారికి వెబ్‌సైట్‌ ద్వారా పూజా చేయించుకున్న భక్తులు ప్రసాదం పంపేందుకు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే దేవదాయశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

Next Story