తబ్లిగీ జమాతే సమావేశంలో పాల్గొన్న వ్యక్తి దక్షిణాఫ్రికాలో మృతి
By Newsmeter.Network
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. భారత్‌లోనూ ఈ వైరస్ భారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. మార్చి 1 నుంచి 15వరకు ఢిల్లిలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశంలో భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయులు పాల్గొన్నారు. వీరిలో కొందరికి వైరస్ సోకడంతో భారత్‌లో కరొనా కేసుల సంఖ్య ఎక్కువైంది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు క రోనాతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ సమావేశంలో పాల్గొని తమతమ రాష్ట్రాలకు వెళ్లిన వారిని పరీక్షించి ఐసోలేషన్ కేంద్రాలకు పంపిస్తుంది. ఇదే సమావేశంలో దక్షిణాఫ్రియాకు చెందిన మౌలానా యూసుఫ్ టూట్లా(80 అనే మతబోధకుడు పాల్గొన్నాడు. కాగా సమావేశాల అనంతరం ఆయన తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు.
Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…
అతనికి వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. టూట్లా భారత్ నుంచి ఇంటికి చేరగానే వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఆయన్ను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రత్యేకవార్డులో ఉంచి అక్కడి వైద్యులు చికిత్స నిర్వహించడంతో కోలుకున్నట్లు కుటుంబ సభ్యులు అక్కడి మీడియాకు తెలిపారు. కానీ సోమవారం ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా అతని కుటుంబ సభ్యులు 14మందితో పాటు, అతన్ను కలుసుకున్న పలువురు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారని అక్కడి మీడియా తెలిపింది. ఇప్పటికే ఈ తబ్లిగీ జమాత్ సమావేశంలో పాల్గొన్న పలువురు మృతిచెందడంతో పాటు ప్రస్తుతం భారత్‌లో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 30శాతం మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నవారు, వారి ద్వారా వచ్చిన వారే ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది.
Also Read :లాక్‌డౌన్ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?