భారత్‌లో దాడులకు ఉగ్రమూకల ప్రణాళికలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 12:32 PM GMT
భారత్‌లో దాడులకు ఉగ్రమూకల ప్రణాళికలు

ఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో భారీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి.

అయితే గత కొంత కాలంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఏ క్షణంలోనైనా దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.దీనిలో భాగంగానే ఈ ఉగ్ర సంస్థ పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో ప్రధానంగా ఢిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఉన్నాయని అధికారులు కేంద్రానికి తెలిపారు.

అయితే జమ్మూ కాశ్మీర్‌లో ఆగస్టు 5న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉగ్రమూకలు దాడులకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగానే పలు కీలకమైన ప్రదేశాల్లో అధిక మొత్తంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Next Story