భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 5:54 AM GMT
భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ము కాశ్మీర్‌లో జరుగుతున్న కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నిన్న రాత్రి నుంచి జవాన్లు, ఉగ్రవాదులు మధ్య దాడులు జరుగుతున్నాయి. దక్షిణ కాశ్మీర్లోని ఓ ఇంట్లో ముష్కరులు తలదాచుకున్న సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీ బుధవారం ఉదయం వారిని గుర్తించింది. ఇంటిని చుట్టుముట్టిన జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వాటిని తిప్పికొట్టేందుకు భద్రతాదళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో స్థానికులను ఖాళీ చేయించారు. ఇంటిని చుట్టుముట్టిన ఆర్మీ దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు పెరిగాయి. అయితే భద్రతా దళాలు చొరబాటుదారులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అంతకుముందు గందర్బల్ అడవుల్లో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల గాలింపు చర్యలు తర్వాత వీరిని పోలీసులు మట్టుబెట్టారు. ఇంటలిజెంట్ సర్వీస్‌కు ఇప్పటికే పాక్ ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయినట్టు సమాచారం అందింది. భద్రతా బలగాలు లక్ష్యంగా తీసుకుని బీభత్సం సృష్టించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story