తెలంగాణ జాగృతిని కొనియాడిన మంత్రి కేటీఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 7:16 AM GMT
తెలంగాణ జాగృతిని కొనియాడిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్: తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌ను ఆవిష్క‌రించే అద్భుత‌మైన పండుగ బ‌తుక‌మ్మ అన్నారు మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ సంస్కృతికే పరిమితమైన బతుకమ్మ పండుగను ఈ రోజున దేశ విదేశాల్లో ఆడపడచులంతా జరపుకుంటున్నారంటే దానికి కారణం తెలంగాణ జాగృతి సంస్థ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ కృషిని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు.

పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్ర‌దాయాన్ని స్వ‌రాష్ట్ర సాధ‌న‌లో సాంస్కృతిక ఆయుధంగా, విడ‌దీయ‌లేని ఉద్య‌మ‌రూపంగా మార్చిన ఘ‌న‌త తెలంగాణ జాగృతి సంస్థ‌దేన‌న్నారు కేటీఆర్. నాటి స‌మైక్య పాల‌కులు ట్యాంక్ బండ్ పై బ‌తుక‌మ్మను నిషేధించి తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల‌ను అవ‌మానిస్తే, హైకోర్టుకు వెళ్లి మ‌రీ బతుక‌మ్మను ఆడిన ఘ‌న చ‌రిత్ర తెలంగాణ జాగృతి సంస్థ‌కు ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల నేత‌న్న‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న బతుక‌మ్మ చీర‌ల‌కు ప్రేర‌ణ జాగృతే అని.. బ‌తుక‌మ్మ పండుగ‌ను విశ్వ‌వ్యాప్తం చేసిన సోద‌రి క‌విత‌, ద‌శాబ్ద కాలంగా జాగృతిలో ప‌ని చేస్తున్న ప్ర‌తీ ఒక్క‌రికి మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ విష‌యాన్ని తెలంగాణ జాగృతి సంస్థ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

Next Story