ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల.. సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఎవరిపై ఫిర్యాదు చేశారంటే..?

YSRTP Leader YS Sharmila Visits Delhi. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు,

By Medi Samrat  Published on  7 Oct 2022 8:47 AM GMT
ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల.. సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఎవరిపై ఫిర్యాదు చేశారంటే..?

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. అందుకోసం శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి కలిసి కాళేశ్వరం పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన షర్మిల సీబీఐ డైరెక్టర్ తో సమావేశమయ్యారు.

తెలంగాణలో షర్మిల తన పాదయాత్ర 2500 కిలో మీటర్లు పూర్తి చేసారు. కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతుందంటూ పాదయాత్రలో విమర్శలు కూడా చేస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ పలు సందర్భాల్లో షర్మిల ఆరోపణలు చేసారు.


Next Story
Share it