పాలేరులో ఎగిరేది వైఎస్సార్టీపీ జెండానే..!

ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్సార్టీపీ బూత్ కార్యకర్తల సమావేశం ఆదివారం జ‌రిగింది.

By Medi Samrat  Published on  29 Oct 2023 7:15 PM IST
పాలేరులో ఎగిరేది వైఎస్సార్టీపీ జెండానే..!

ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్సార్టీపీ బూత్ కార్యకర్తల సమావేశం ఆదివారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి నియోజక వర్గం నుంచి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. స‌మావేశంలో వారు వైఎస్ షర్మిలను అధిక మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కాంట్రాక్టర్లకు, ప్రజా సేవ చేసే వాళ్లకు మ‌ధ్య‌ జరిగే ఎన్నికలుగా అభివ‌ర్ణించారు. పాలేరులో ప్రజా సేవ చేసే వైఎస్ షర్మిల రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని జోష్యం చెప్పారు.

రెండున్నర ఏళ్ల నుంచి మా నాయకురాలు ప్రజా సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. మాట ఇచ్చిన మేరకు ష‌ర్మిల‌ పాలేరు నుంచే పోటీ చేస్తున్నారని వెల్ల‌డించారు. వైఎస్సార్ బిక్షతో రాజకీయంగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఇవాళ చులకనగా మాట్లాడుతున్నారయ‌ని ఫైర్ అయ్యారు. పొంగులేటి వైఖరిని వైఎస్సార్టీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పాలేరులో ఎగిరేది వైఎస్సార్టీపీ జెండానే అని ఘంటాప‌థంగా చెప్పారు.

Next Story