విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం.. ఈ సభలోనైనా..

YS Sharmila Slams CM KCR. తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ ప్రధాని న‌రేంద్ర మోదీకి స్వాగతం

By Medi Samrat  Published on  8 April 2023 5:00 AM GMT
విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం.. ఈ సభలోనైనా..

తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ ప్రధాని న‌రేంద్ర మోదీకి స్వాగతం పలుకుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం అన్నారు. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవని.. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘కాళేశ్వరం KCRకు ATM’ అని BJP లీడర్లు బుకాయిస్తున్నారు కానీ.. ఎంక్వైరీ చేయడం లేదని అన్నారు.

వైఎస్సార్టీపీ కాళేశ్వరం అవినీతిపై ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసిందని తెలిపారు. కాగ్‌, సీబీఐకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవని అన్నారు. మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం అన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండని నిలదీసే దమ్ము దొర గారికి లేదని విమ‌ర్శించారు. చేతకాని దద్దమ్మలా ఫామ్ హౌజ్ కే పరిమితమై, ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని.. దొర గారి రాజకీయాలు, మొండి వైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.


Next Story