కేసీఅర్‌కు ఎన్నికలతోనే పని : వైఎస్ షర్మిల

YS Sharmila Fire On CM KCR. సీఎం కేసీఅర్ కు ఎన్నికలతోనే పని అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమ‌ర్శించారు.

By Medi Samrat
Published on : 10 Nov 2022 1:32 PM IST

కేసీఅర్‌కు ఎన్నికలతోనే పని : వైఎస్ షర్మిల

సీఎం కేసీఅర్ కు ఎన్నికలతోనే పని అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమ‌ర్శించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఅర్ కు ఎన్నికలతోనే పని.. ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తార‌ని అన్నారు. గాడిదకు రంగు పూస్తడు.. ఇదే ఆవు అని నమ్మిస్తాడు.. ఓట్లు వేయించుకొని దొర మళ్ళీ ఫామ్ హౌజ్ కి పోతాడు.. మళ్ళీ తిరిగి ప్రజల వైపు చూడడు అని విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ తీరు.. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటినంక బోడి మల్లన్న అన్న చందంగా ఉంద‌ని ఎండ‌గ‌ట్టారు. కేసీఅర్ బోడి మల్లన్న లెక్క.. అందుకే ఈ సారి కేసీఅర్ కి బుద్ది చెప్పాలని అని తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్ సంక్షేమం తీసుకురావ‌డం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భ‌వించింద‌ని.. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తాన‌ని ష‌ర్మిల చెప్పారు.


Next Story