YS Sharmila : వైఎస్ షర్మిలకు అస్వస్థత

YS Sharmila fell down in unconscious state during a visit in khammam. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు.

By Medi Samrat
Published on : 30 April 2023 2:40 PM IST

YS Sharmila : వైఎస్ షర్మిలకు అస్వస్థత

ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. వైరా నియోజక వర్గం కొణిజర్ల మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలంచారు. కొణిజర్ల మండలంలోని తనికెళ్ళ గ్రామం బోనకల్ మండలంలోని లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. పంట నష్టం వివరాలను రైతుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. ఉదయం నుంచి ఎండలో తిరగటం వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.




Next Story