కండక్టర్ పై దాడి చేసిన మహిళ కటకటాల పాలు..!

జనవరి 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిడుతూ.. దాడి చేసిన మహిళకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  4 Feb 2024 9:30 PM IST
కండక్టర్ పై దాడి చేసిన మహిళ కటకటాల పాలు..!

కండక్టర్ పై దాడి చేసిన మహిళ కటకటాల పాలు..!

జనవరి 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిడుతూ.. దాడి చేసిన మహిళకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే!! ఆమెను అరెస్టు చేయాలని, జైలుకు పంపాలంటూ పలువురు డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు ఆమెను అరెస్టు చేశారు. ఆదివారం నాడు ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

జనవరి 25వ తేదీన హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో దుర్భాష లాడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడి చేసింది. ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించాడు. ఈ సంఘటన పై టీఎస్ఆర్టీసీ చీఫ్ సజ్జనార్ కూడా స్పందించారు. హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. అంబర్పేటకు చెందిన సమీనా బేగం అనే మహిళ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story