డిసెంబర్ 2020 ఐటీ దాడుల తర్వాత బీజేపీకి 10 కోట్లు విరాళంగా ఇచ్చిన యశోద హాస్పిటల్స్
Yashoda Hospitals 'donated' Rs 10 cr to BJP months after Dec 2020 IT raids. పలు రాజకీయ పార్టీలకు ప్రముఖ కంపెనీలు పార్టీ ఫండ్ ను ఇవ్వడం చాలా కామన్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jan 2023 12:17 PM GMTపలు రాజకీయ పార్టీలకు ప్రముఖ కంపెనీలు పార్టీ ఫండ్ ను ఇవ్వడం చాలా కామన్..! తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన యశోద హాస్పిటల్స్ భారతీయ జనతా పార్టీకి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి వచ్చిన నిధులు గతేడాది (వ్యక్తిగత, కార్పొరేట్ విరాళాలు మైనస్ ఎలక్టోరల్ బాండ్లు) 960 కోట్ల రూపాయలు.
బీజేపీకి 2021-2022లో విరాళాల ద్వారా రూ 614,52,64990 (రూ. 614.52 కోట్లు) వచ్చింది. ఇవి ఎలక్టోరల్ ట్రస్ట్‌లు మరియు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన నిధులు. దేశంలోని వ్యక్తులు, కార్పొరేట్ల నుంచి బీజేపీ అత్యధిక విరాళాలు అందుకోవడం వరుసగా ఇది తొమ్మిదో ఏడాది. యశోద గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసిన ఒక సంవత్సరం తర్వాత విరాళం ఇవ్వడం గమనించవచ్చు. 23 డిసెంబర్ 2020న యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 33 సంవత్సరాల కిందట యశోద గ్రూప్‌ని డాక్టర్ జి. సురేందర్ రావు స్థాపించారు, ఆ తర్వాత తన సోదరులు జి. దేవేందర్ రావు, జి. రవేందర్ రావుతో కలిసి కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత యశోద హాస్పిటల్స్‌ను ప్రారంభించారు.
అదే సంవత్సరం BJPకి హైదరాబాద్ నుండి భారీ విరాళం ఇచ్చిన కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ గ్రూప్‌ను BJPలో ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నడుపుతున్నారు. 3 కోట్ల రూపాయలు విరాళం వీరు ఇచ్చారు. ఈ రెండు కంపెనీల తర్వాత సత్యం ఇస్పాత్ ఇండస్ట్రీస్ (రూ. 50 లక్షలు), సాగర్ సిమెంట్స్ (రూ. 25 లక్షలు) ఉన్నాయి.
2019-20లో, శ్రీనివాసరాజు చింతలపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ILABS టెక్నాలజీస్, మేఘా ఇంజనీరింగ్ (MEIL) సంస్థ భారతీయ జనతా పార్టీకి భారీగా విరాళాలు అందించాయి. 5 కోట్లు చెప్పున విరాళాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ నుండి విరాళాలు తక్కువే :
ఎడిఆర్ నివేదిక: ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా బీజేపీకి భారీగా నిధులు :
బీజేపీకి అతిపెద్ద ఆర్థిక బలం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారానే వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, 89కి పైగా కార్పొరేట్లు/వ్యాపార సంస్థలు ఎలక్టోరల్ ట్రస్టులకు 475.8021 కోట్లు ఇచ్చారు. అదే సంవత్సరంలో 40 మంది వ్యక్తులు కూడా ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు ఆర్థికంగా సహకరించారు. 21 ట్రస్టులలో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అత్యధికంగా వచ్చాయి. వాటి ద్వారా 336.50 కోట్ల రూపాయలు అందాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 209 కోట్లు అందించారు. కాగా, ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 2021-22లో బీజేపీకి 10 కోట్ల రూపాయలు వచ్చాయి.
1. స్మాల్ డొనేషన్స్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ. 1.9351 కోట్లను INCకి విరాళంగా ఇచ్చింది.
2. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ తొమ్మిది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది, వీటిలో ప్రధాన పార్టీలైన BJP, TRS, SP, AAP, INC, YSR కాంగ్రెస్, SAD, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మరియు గోవా ఫార్వర్డ్ పార్టీ ఉన్నాయి.
3. బీజేపీకి ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుండి అన్ని రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 351.50 కోట్ల రూపాయలు.. దాదాపు 72.17%.
4. టీఆర్ ఎస్ కు మొత్తం ఆరు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుండి అన్ని పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 40 కోట్ల రూపాయలు.. 8.21% ఉన్నాయి.
5. ఇతర ఎనిమిది రాజకీయ పార్టీలు-SP, AAP, YSR కాంగ్రెస్, INC, SAD, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, DMK లకు 95.56 కోట్లు వచ్చాయి.
2013లో, కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల కోసం పథకాన్ని ప్రవేశపెట్టింది, దీని కింద కార్పొరేషన్లు పార్టీలకు డబ్బును సేకరించడానికి, విరాళంగా ఇవ్వడానికి ట్రస్టులను ఏర్పాటు చేయవచ్చు. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ల మధ్య ప్రత్యక్ష లావాదేవీలను ఇది నిరోధించగలదని పథకం వెనుక ఉన్న ప్రత్యక్ష ఉద్దేశం. ఏ కార్పోరేట్ ఏ ట్రస్టును ఏర్పాటు చేసిందో బాగా తెలిసినందున దీని వల్ల ప్రయోజనం లేదు.
2017లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఈ నిధుల ప్రక్రియను పూర్తిగా అపారదర్శకంగా మార్చింది. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అనుకూలమైనది కాదు. ప్రభుత్వ చర్యలను కార్పొరేట్లు నియంత్రించే అవకాశం ఉంది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు ఎంత మొత్తం పొందాయనే సమాచారం త్వరలోనే అందిస్తాం.