తలసానిపై వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

Yadavs burn effigy of Revanth, demand apology for remarks. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు

By Medi Samrat  Published on  15 May 2023 3:00 PM IST
తలసానిపై వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవ సంఘం ఆందోళ‌న‌కు దిగింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి తలసానిని ఉద్దేశిస్తూ పెండ పిసుక్కోనే వాడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. యావత్ యాదవ జాతిని కించపరిచే విధంగా ఉన్నాయని వారు ఆరోపించారు. అనాదిగా అణగారిన వర్గాలపై అగ్రకులాల వ్యక్తులు అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని.. వారి వైఖరి మార్చుకోవాలని వారు హితవు పలికారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆయనను ఎక్కడికక్కడ ఘోరావ్ చేస్తామని హెచ్చరించారు.


Next Story