చిరుతపులిని చూశాడు.. ఊహించని విషాదం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య రోడ్డుపై చిరుత పులిని గుర్తించి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా పడింది.

By Medi Samrat  Published on  27 Jun 2024 4:15 AM GMT
చిరుతపులిని చూశాడు.. ఊహించని విషాదం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య రోడ్డుపై చిరుత పులిని గుర్తించి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని గాంధారి మండలం యాచారంకు చెందిన మాలోత్ లలిత (30)గా గుర్తించారు.

లలిత, ఆమె భర్త మాలోత్ ప్రభాకర్ మంగళవారం మోపాల్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మోపాల్ నుంచి యాచారంలోని తమ ఇంటికి కారులో తిరిగి వస్తున్నారు. వీరి కారు ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య అటవీ ప్రాంతానికి చేరుకోగానే రోడ్డుపై చిరుత పులిని గమనించిన ప్రభాకర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కారు వేగంగా వెళుతూ ఉండడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొని బోల్తా పడింది. దీంతో మాలోత్ లలిత అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభాకర్ తలకు గాయమైంది. అదే రూట్ లో వెళుతున్న వాళ్లు.. క్షతగాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story