కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బందోబస్తుకు వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆయన స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అయితే ఈ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ పద్మజను ఓ యువకుడు ప్రమాదవశాత్తు బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు.
కాగా ఈ ఘటనలో ఆమె కాలు విగరడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. చికిత్సకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.