'తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన' అమలు చేయకపోవడానికి గల కారణాలను వివరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రాన్ని కోరింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2023 10:13 AM IST
Telangana, farmers, central crop insurance, High Court, KCR Sarkar

'తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)' అమలు చేయకపోవడానికి గల కారణాలను వివరించాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం రాష్ట్రాన్ని కోరింది. తెలంగాణ రైతులకు పంట నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు మాత్రమే ఇస్తుండగా, కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.

‘‘రాష్ట్రం ఎకరాకు పంట నష్టపరిహారంగా రైతులకు రూ.10 వేలు మాత్రమే మంజూరు చేస్తోంది. రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే పథకం ఏదైనా ఉంటే దానిని స్వీకరించాలి. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) రైతులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది’’ అని సీజే అలోక్ ఆరాధే అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ ఒక పిల్ దాఖలు చేశారు. ఇది అన్ని రకాల పంట సమస్యలను కవర్ చేస్తుంది. రైతులకు తగిన బీమా, ఆర్థిక సహాయంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పిల్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌ కుమార్‌తో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ స్పందించింది.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ చివరి వారంలో తెలంగాణ వ్యాప్తంగా 2.23 లక్షల ఎకరాల్లో సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు మాత్రమే పరిహారంగా కేటాయించిందని పిటిషనర్‌ కోర్టుకు నివేదించారు.

బెంచ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, భారత ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి భారత ప్రభుత్వం; తెలంగాణ ఆర్థిక, ప్రణాళిక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కమిషనర్, తెలంగాణ హార్టికల్చర్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.

Next Story