ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలెప్పుడు? తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఫైర్

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది.

By Knakam Karthik  Published on  31 Jan 2025 2:54 PM IST
Supreme Court on Party Defections, Telangana, Brs, Congress

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలెప్పుడు? తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఫైర్

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గత సంవత్సరం మార్చి నెలలోనే చెప్పినా నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ తరపు లాయర్ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడంలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ తగిన సమయం ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అంటూ ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే దాకా.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. శాసనసభ స్పీకర్‌ ను అడిగి నిర్ణయాన్ని కోర్టుకు విన్నవిస్తామని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన తెల్లం వెంకట్ రావు , దానం నాగేందర్ , కడియం శ్రీహరి‌తో సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ఇప్పటి దాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, ఫిరాయింపుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇటీవలే హరీశ్ రావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Next Story