కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రజినీకి తొలి ఉద్యోగం ఇస్తామ‌ని రేవంత్ హామీ

నాంపల్లికి చెందిన దివ్యాంగురాలైన యువ‌తికి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.

By Medi Samrat  Published on  17 Oct 2023 4:38 PM IST
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రజినీకి తొలి ఉద్యోగం ఇస్తామ‌ని రేవంత్ హామీ

నాంపల్లికి చెందిన దివ్యాంగురాలైన యువ‌తికి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ర‌జినీ అనే దివ్యాంగురాలైన యువ‌తికి పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు. ప్రైవేట్ సంస్థల్లో ట్రై చేసినా ఉద్యోగం ద‌క్క‌లేదని రేవంత్ రెడ్డితో రజినీ తన ఆవేదనను చెప్పుకున్నారు. ర‌జినీ స‌మ‌స్య‌ను విన్న రేవంత్ రెడ్డి ఆమెతో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ కార్య‌క్ర‌మానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున‌ ఖర్గే వస్తారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తుంది.. ఇది నా గ్యారంటీ అని రజినీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో రేవంత్ స్వయంగా రజినీ వివ‌రాల‌ను నింపారు.

Next Story