రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. తాజా వాతావరణ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ పట్టణంలో నిన్న 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని హైదరాబాద్‌లోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల మార్పులకు సంబంధించి వాతావరణ శాఖ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలను చూసిన రాష్ట్ర ప్రజలు రానున్న నాలుగు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలను చూడనున్నారు.