ఓమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

We are ready if the Omicron comes in Telangana. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం

By Medi Samrat  Published on  28 Nov 2021 2:03 PM GMT
ఓమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రకం వైరస్‌ దక్షిణాఫ్రికా మొదలు బోట్స్‌వానా, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ తదితర దేశాలకు విస్తరించింది. ఇదే క్రమంలో తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఈ వేరియంట్‌కు సంబంధించిన రెండు కేసులు బయటపడటం స్థానికంగా కలవరానికి దారితీసింది. ఈ నేఫ‌థ్యంలోనే ప్రధాని మోడీ కూడా దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త వేరియంట్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై, ప్రభుత్వ సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు యూరప్ దేశాల నుంచి వస్తున్న వాళ్లపై నిఘా పెట్టనున్నామని, వాళ్ళను ట్రేస్ చేయడం, టెస్ట్ చేయడం పై దృష్టి పెడుతామన్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులో నిఘా పెంచుతామని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామ‌ని.. 5 నెలలుగా కేసులు బాగా తగ్గాయని తెలిపారు. అయితే.. కేసులు తగ్గాయని.. జనాల్లో నిర్లక్ష్యం వచ్చిందని.. కానీ.. మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చిందని హెచ్చ‌రించారు. స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని తెలిపారు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ.. ఖచ్చితంగా సెకండ్ డోస్ తీసుకోవాలని సూచించారు.


Next Story
Share it