నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే

వర్ధన్నపేట బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని తెలిపారు.

By Medi Samrat  Published on  13 March 2024 6:15 PM IST
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే

వర్ధన్నపేట బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు తనను తన ఇంటి నుంచి కిడ్నాప్‌ చేశారని వచ్చిన వార్తలను కూడా అయన ఖండించారు. వరంగల్ లోక్‌సభ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బస్వరాజ్‌ సారయ్యతో కలిసి ఆరూరి రమేష్‌ బుధవారం బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖరరావు నందినగర్‌ నివాసానికి చేరుకున్నారు.

రెండు రోజులుగా ఆరూరి రమేశ్ విషయంలో హైడ్రామా కొనసాగింది. బుధవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆయనను వరంగల్ నుంచి కేసీఆర్ నివాసానికి తీసుకువచ్చారు. చర్చల కోసం కేసీఆర్ ఆయనను పిలిపించినట్లుగా చెబుతున్నారు. "బీజేపీలోకి మారే ఆలోచన లేదు. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. బీఆర్‌ఎస్ నాయకులు నా కోసం వచ్చారు, మేము సమావేశానికి ఇక్కడకు వచ్చాము, ”అని కేసీఆర్ నివాసానికి చేరుకున్న తర్వాత రమేష్ మీడియాతో అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశానని చెబుతున్నారని, కానీ అందులో వాస్తవం లేదన్నారు.

Next Story