కాంగ్రెస్ లోకి రాములమ్మ.. కన్ఫర్మ్ చేసేసినట్లే.!

రాములమ్మ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

By Medi Samrat  Published on  11 Nov 2023 5:23 PM IST
కాంగ్రెస్ లోకి రాములమ్మ.. కన్ఫర్మ్ చేసేసినట్లే.!

రాములమ్మ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. ప్రస్తుతం విజయశాంతి బీజేపీలో ఉన్నారు.. అయితే కొన్నిరోజులుగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి ఆమె పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

గత కొంత కాలంగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె హాజరవ్వలేదు. బీజేపీ అధిష్టానంపై ఆమె అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా సాగింది. ఆమె పార్టీ మారతారని చాలా రోజులుగా ప్రచారం సాగింది. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఇక పార్టీని వీడడం కన్ఫర్మ్ అయింది.

Next Story