కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదు : విజయశాంతి
Vijayashanti criticizes CM KCR. బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు
By Medi Samrat Published on 25 March 2023 2:45 PM GMTVijayashanti criticizes CM KCR
బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్చి 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు మాగ్గావాలి" పేరుతో బీజేపీ పార్టీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో విజయశాంతి మాట్లాడుతూ.. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని కొత్త నిర్వచనం చెప్పారు. TSPSC పేపర్ లీకేజీలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్లీ భేరాలు ఆడుతాడని అన్నారు విజయశాంతి. ఆయనకు కావాల్సింది లాభాలు మాత్రమేనని అన్నారు విజయశాంతి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పేపర్ లీకేజీ కావడంతో నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజులు మాఫీ చేస్తామని, ఉచితంగా భోజనాలు పెడతాం, పుస్తకాలు పంపిణీ చేస్తామని మాయ మాటలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు విజయశాంతి. 3 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారని.. కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని అన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. బండి సంజయ్ మట్లాడుతూ టీఎస్‌పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులిస్తున్నారన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరారు. నిరుద్యోగులు అధైర్య పడొద్దని.. బీజేపీ అండగా ఉంటుందన్నారు.