రాహుల్ గాంధీపై అనర్హత వేటు : దేశ చరిత్రలో చీకటి రోజు - సీఎం కేసీఆర్

CM KCR condemned the disqualification of Rahul Gandhi. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్

By Medi Samrat
Published on : 24 March 2023 6:36 PM IST

రాహుల్ గాంధీపై అనర్హత వేటు : దేశ చరిత్రలో చీకటి రోజు - సీఎం కేసీఆర్

CM KCR condemned the disqualification of Rahul Gandhi


కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా అభివ‌ర్ణించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమ‌న్నారు

ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది విమ‌ర్శించారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందన్నారు. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని అన్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. బీజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.


Next Story