రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఒక్కటే ప్రత్యామ్నాయం
Vijayashanti Comments On Congress Party. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం హుజురాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. నేతల విమర్శలు
By Medi Samrat Published on 13 July 2021 11:06 AM GMT
ప్రస్తుతం తెలంగాణ రాజకీయం హుజురాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రోజురోజుకు హీటెక్కుతుంది. తాజాగా బీజేపీ మహిళానేత విజయశాంతి.. యువనేత కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2018లో కాంగ్రెస్ నుండి హుజూరాబాద్ లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. ఆ పార్టీ వద్దని రాజీనామా చేసారు. అంతే కాదు.. ఇప్పుడు ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పటం ఇక్కడ అర్థం చేసుకోవలసిన పరిణామమని ఆమె అన్నారు.
అయితే.. కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు.. తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికలు సాధ్యపడదనే అభిప్రాయంలో చాలా మంది నేతలు ఉన్నారని విమర్శించారు. కాంగ్రెసుకు ఓటు వేసి గెలిపించినా.. టీఆర్ఎస్ లోనే చేరతారని.. ఎందుకంటే.. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన విషయం కళ్ళముందే ఉందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న పీసీసీ ప్రకటన కూడా మాటలకే పరిమితమయ్యేలా కనిపిస్తోందని.. తెలంగాణను లూటీ చేసి, అప్పుల్లో నెట్టిన టీఆర్ఎస్ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే.. బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని విజయశాంతి అన్నారు.