తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి కామెంట్స్ విన్నారా.?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకుంది. 64 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా..

By Medi Samrat  Published on  3 Dec 2023 9:00 PM IST
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి కామెంట్స్ విన్నారా.?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకుంది. 64 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. మిత్ర పక్షం సీపీఐ 1 స్థానంలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రయత్నాలు మొదలైపోయాయి. టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సాయపడిందనే ప్రచారం సాగుతూ ఉంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసాలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడన్నారు. వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకునే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలను కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుందని.. మరి చంద్రబాబు, పురంధేశ్వరి వల్ల కాంగ్రెస్, బీజేపీలకు ఒరిగింది ఏమిటని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Next Story