స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని డైవర్ట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల

ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

By Medi Samrat
Published on : 13 March 2025 9:01 AM

స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని డైవర్ట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల

ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. సభలో మా సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పులేదు అన్నారు. సభలో అందరికి సమాన హక్కులు ఉంటాయి, మా అందరి హక్కులు కాపాడటానికి మీరు ఆ స్థానంలో ఉన్నారు అని అన్నారు.. ఇందులో తప్పేముందన్నారు.

శాసన సభ సభాపతిపై మాకు అత్యంత గౌరవం ఉంది, ఆయన స్థాయిని తగ్గించేలా మేము ఎప్పుడు వ్యవహరించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఆ వ్యాఖ్యలతో వచ్చిన ప్రజా వ్యతిరేక‌తను స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. మా సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలు అమలు చేసారా అని సభావేధికగా ప్రశ్నించేస‌రికి సమాధానం చెప్పలేక ఒక డ్రామాకు తెరలేపారన్నారు.

100 రోజుల్లోనే 2 లక్షల రుణామాఫీ, 15,000 రైతు భరోసా, రూ.2500 మహాలక్ష్మి, రూ.4,000 పెన్షన్, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి, రూ.5 లక్షల భరోసా కార్డు ఇలా అనేక హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 100 రోజుల్లో అమలు చేస్తామని ఎవరు చెప్పమన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 15 నెలలు అయినా చేయలేదు కాబట్టి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.. అందుకే ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ ఇవ్వటం లేదు, మీడియా పాయింట్ కి వస్తే ఇక్కడ కాంగ్రెస్ శాసన సభాపక్షం మొత్తం మీడియా పాయింట్ లో ఉండి మాకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని వాపోయారు.

Next Story