కేసీఆర్ కు కేటాయించిన గదిపై రచ్చ

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  8 Feb 2024 7:30 PM IST
కేసీఆర్ కు కేటాయించిన గదిపై రచ్చ

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం కరెక్ట్ కాదని అన్నారు. మొదట సభాపతి కావాలని అడగడంతో ఎల్‌వోపీని ఇచ్చామని, స్పీకర్ మీద గౌరవంతో మాత్రమే ఇచ్చినట్లు చెప్పారు. పెద్ద ఛాంబర్ ఇస్తామని హామీ ఇచ్చారని కానీ చిన్న గదిని కేటాయించడం సరికాదన్నారు. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ఎల్‌వోపీ గదిని వారి సౌకర్యం కోసం ఇవ్వడానికి కేసీఆర్ అంగీకరించారన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఐదుగురు ఉన్నప్పుడు కూడా మేము ఎల్‌వోపీ రూమ్ ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో తమ పార్టీకి చెందిన చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన ఎమ్మెల్యే భార్యకు ప్రోటోకాల్ ఇస్తున్నారన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ ఇస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాలు.. ముఖ్యమంత్రులు మారినా నిబంధనలు ఒకేలా ఉండాలన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల‌ను తీసుకెళ్లేంత మొగోళ్లు కాంగ్రెస్‌లో లేరని విమర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదన్నారు.

Next Story