మార్వాడీ గో బ్యాక్ ఎక్కడి నినాదం అంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావు సీరియస్ అయ్యారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. రిలయన్స్, డీ మార్ట్ లాంటి బడా కంపెనీలలో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి.. మరి వాళ్ళను ఎందుకు గో బ్యాక్ అనడం లేదు.. మార్వాడీలను గో బ్యాక్ అనడం ఏంటి అని ప్రశ్నించారు.
తరతరాలుగా మార్వాడీలు తెలంగాణలో ఉంటున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది.. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు.. ఈ విధమైన నినాదాలతో అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే.. తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు.