దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారు : వీహెచ్‌

తిరుమ‌ల ల‌డ్డూ వివాదంలో సీబీఐ ఎంక్వైరీ కోరుతూ.. రోజు ఉదయం 9 గంటల నుంచి లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావు దీక్ష చేప‌ట్టారు

By Medi Samrat  Published on  24 Sept 2024 1:00 PM IST
దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారు : వీహెచ్‌

తిరుమ‌ల ల‌డ్డూ వివాదంలో సీబీఐ ఎంక్వైరీ కోరుతూ.. రోజు ఉదయం 9 గంటల నుంచి లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావు దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్షకు కూర్చున్నానని తెలిపారు. తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు పవిత్రత ఉంది. అలాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల క్రొవ్వు కలపడం దారుణమ‌న్నారు.

ప్రపంచ దేశాలలో వెంకన్న భక్తులు ఉన్నారు. గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. తిరుమల దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారు. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తాను చేస్తున్న దీక్షతో అయిన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలి. ఈ సమస్య తొందరగా పరిష్కరించాలి.. లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యం అన్నారు. సీబీఐ ఎంక్వైరీ త్వరగా చేసి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story