రేవంత్ ఎలాంటి లేఖ రాయ‌లేదు : వీహెచ్‌

తెలంగాణలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని.. వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో ప్రచారం చేశాన‌ని..

By Medi Samrat  Published on  27 Nov 2023 12:49 PM GMT
రేవంత్ ఎలాంటి లేఖ రాయ‌లేదు : వీహెచ్‌

తెలంగాణలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని.. వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో ప్రచారం చేశాన‌ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ కూతురు వెన్నెలకు మద్దతుగా కంటోన్మెంట్ లో ప్రచారం చేశాన‌ని వెల్ల‌డించారు. ఎక్కడ చూసినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి వెళ్లాయన్నారు.

కేసీఆర్ ఓటుకు 3 - 5 వేల వరకూ ఇచ్చి కొనాలని చూస్తున్నారు. కేసీఆర్.. నంబర్ 1 పాలన అన్నప్పుడు.. డబ్బులు ఎందుకు పంచుతున్నావ్ అని ప్ర‌శ్నించారు. ప్రజలు కాంగ్రెస్ వైపు మల్లుతున్నారు. దీంతో బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని అన్నారు. గజ్వేల్ వదిలి కామారెడ్డి పోయినప్పుడే ప్రజలకు అర్థమైందన్నారు. మీ పైసలే పంచుతున్నారు.. డబ్బులు తీసుకొని ఓటు కాంగ్రెస్ కి వేయాలని అన్నారు. కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది.. రాహుల్ గాంధీ భార‌త్‌ జోడో యాత్ర తరువాత భయం స్టార్ట్ అయ్యింద‌న్నారు.

డబ్బులు పంచుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్ర‌శ్నించారు. వికాస్ రాజ్ కి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ కావడం లేదన్నారు. రైతు బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ కి కాంగ్రెస్ ఫిర్యాదు చేయలేదన్నారు. రేవంత్ ఎలాంటి లేఖ రాయ‌లేదని స్ప‌ష్టం చేశారు. 30వ తేదీ కాంగ్రెస్‌కు పట్టం కట్టనున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.. ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story