కేంద్రంలో బీజేపీ అదికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రంలో ఎప్పటికి అధికారంలోకి రాదని.. 80 సీట్లు కాదు కదా.. 8 సీట్లు వస్తే గొప్పని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల చట్టాల విషయంలో కూడా బీజేపీ మూర్ఖంగా వ్యవహరించిందని వీహెచ్ కామెంట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీని ఎవరు అడ్టుకోలేరని హనుమంత రావు అన్నారు. తాత్కాలికంగా నష్టపోయినా భవిష్యత్తు కాంగ్రెస్ దే అని తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో లభించిన విజయం బీజేపీ గెలుపు కాదని.. రఘునందన్, ఈటల రాజేందర్ ల గెలుపు మాత్రమేనని అన్నారు. ఈ ఏడేళ్లలో పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నాంటాయని.. కాంగ్రెస్ ను విమర్శించే స్దాయి బీజేపీ నేతలకు లేదని వీహెచ్ అన్నారు.