లొట్ట పీసు కేసు అన్నది మీరే కదా.. ఇన్నోసెంట్ అని నిరూపించుకోండి..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన సిట్ చాలా మందిని విచారించింద‌ని.. అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందని వి. హనుమంతరావు(వీహెచ్‌) అన్నారు.

By -  Medi Samrat
Published on : 2 Feb 2026 6:07 PM IST

లొట్ట పీసు కేసు అన్నది మీరే కదా.. ఇన్నోసెంట్ అని నిరూపించుకోండి..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన సిట్ చాలా మందిని విచారించింద‌ని.. అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందని వి. హనుమంతరావు(వీహెచ్‌) అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆత్మ గౌర‌వం గుర్తు వచ్చిందని.. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నించారు.

నేను అంబేద్కర్ విగ్రహం పంజాగుట్టలో పెడితే కూలకొట్టారు . కొత్త విగ్రహం చేపిస్తే దాన్ని దాచిపెట్టారు.. కేసు పెట్టి నేను నా విగ్రహాన్ని దక్కించుకున్నాను.. ఇలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు, ఆత్మ గౌరవం అంటున్నారని ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డి మీద‌ కేసు పెట్టి జైలులో ఎందుకు పెట్టారు.. కక్షతో కాదా అని ప్ర‌శ్నించారు. లా అనేది అందరికి ఒక్కటే.. ప్రజలకు బీఆర్ఎస్ నేతల నీతి, నిజాయితీలు తెలియాలన్నారు. ప్రజా జీవితంలోకి వ‌చ్చినప్పుడు ఇలాంటివి ఫేస్ చెయ్యాలన్నారు. లొట్ట పీసు కేసు అన్నది మీరే కదా.! మళ్లీ ఎందుకు ఆత్మ గౌరవం, కక్ష సాధింపు చర్యలు అంటున్నారు..? మీరు ఇన్నోసెంట్ అని నిరూపించుకోండని సెటైర్లు సంధించారు.

Next Story