టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మహిళల్ని చీట్ చేస్తుంది

Uttamkumar Reddy Fires On TRS Govt. టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ మాజీ

By Medi Samrat  Published on  5 Sep 2021 9:02 AM GMT
టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మహిళల్ని చీట్ చేస్తుంది

టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, న‌ల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహిళా సాధికారతకి కాంగ్రెస్ పెద్ద పీట వేసిందని.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మహిళల్ని చీట్ చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని.. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక.. వడ్డీ లేని రుణం పరిమితి రూ.10 లక్షలకు పెంచుతా అన్నార‌ని.. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇవ్వలేదని మండిప‌డ్డారు.

ప్రభుత్వం రూ. 3000 కోట్లు మహిళా సంఘాలకు బకాయి పడిందని.. ఒక్కో మహిళకు ఐదు నుండి 10 వేలు బాకీ ఉన్నార‌ని ఉత్తమ్ అన్నారు. హుజూరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని రూ.50 కోట్లు విడుదల చేశారని.. ప్రభుత్వం వడ్డీలు ఇవ్వకపోగా.. మహిళల నుండి వడ్డీలు వసూలు చేయాలని ఒత్తిడి పెంచుతుందని అన్నారు. వ‌డ్డీలు చెల్లించని చోట.. అధికారులను సస్పెండ్ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.


Next Story