కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాలికి గాయం

Union Minister Kishan Reddy Suffered Leg Fracture. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గాయమైంది. ఆయనకు కుడికాలి మడమ వద్ద బోన్ ఫ్రాక్చర్ అయ్యింది.

By Medi Samrat
Published on : 12 Oct 2022 7:15 PM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాలికి గాయం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గాయమైంది. ఆయనకు కుడికాలి మడమ వద్ద బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆయన కుడికాలు మడమకు దెబ్బ తగిలింది. ఇటీవల లెగ్ పెయిన్ ఎక్కువగా రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG హాస్పటల్ కు వెళ్లారు. అక్కడ ఎక్సరే తీయగా అందులో కుడికాలి మడమ వద్ద ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన కాలికి పట్టీ కట్టారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.

కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే లెగ్ పెయిన్ తగ్గుతుందని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. గత కొద్ది రోజుల నుంచి కాలి మడమ వద్ద నొప్పి తీవ్రతరం కావడంతో పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్ కు వచ్చారు.


Next Story