కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి : కిషన్‌రెడ్డి

హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  26 Sept 2024 5:50 PM IST
కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి : కిషన్‌రెడ్డి

హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలని.. మీరు కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారని లేఖ‌లో అన్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా..? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలని ప్ర‌శ్నించారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఇచ్చిన అనుమతులను.. తప్పు అని హైడ్రా ఎలా చెబుతుందని ప్ర‌శ్నించారు. అధికారులు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష వేస్తారా..? అని లేఖ‌లో నిల‌దీశారు. గత ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశాయని.. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలన్నారు. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలని కిష‌న్ రెడ్డి అన్నారు.

Next Story