దోసలవాగు వ‌ర‌ద ప్ర‌వాహంలో ఇద్దరు యువతుల గల్లంతు

Two Young Womens Were Abducted In Dosalavagu. యాదాద్రి-భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజపేట మండలం

By Medi Samrat  Published on  30 Aug 2021 12:47 PM GMT
దోసలవాగు వ‌ర‌ద ప్ర‌వాహంలో ఇద్దరు యువతుల గల్లంతు

యాదాద్రి-భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఓ శుభకార్యానికి శ్రవణ్ అనే వ్యక్తి బైక్ పై బయలు దేరారు. ఇటికలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి కొట్టుకుపోయారు. పోలీసులు, స్థానికులు యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్కూటీ మీద ఒక యువకుడు, ఇద్దరు యువతులు వాగు మధ్యలో వస్తుండగా స్కూటీ ఆగిపోయింది.

దీంతో కిందకు దిగిన.. హిమబిందు, సింధూజ వ‌ర‌ద ప్ర‌వాహానికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 8 గంటల వరకు జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ఆలేరులో 194 మిల్లీ మీటర్లు, రాజపేట మండలంలో 156 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.


Next Story
Share it