మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రెండేళ్లు.. ఫ్రీ జర్నీ చేసిన 251 కోట్ల మంది మహిళలు

మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు ఏళ్ళు పూర్తి అయ్యింది.

By -  అంజి
Published on : 9 Dec 2025 9:47 AM IST

Maha Lakshmi scheme, Telangana, women,travel, TGSRTC

మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రెండేళ్లు.. ఫ్రీ జర్నీ చేసిన 251 కోట్ల మంది మహిళలు

హైదరాబాద్‌: మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు , సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9,2023 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది. నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు 8459 కోట్ల విలువైన ప్రయాణం పొందగలిగారు.

దీని ద్వారా కుటుంబాల బంధుత్వాలు పెరగడం, దేవాలయాల సందర్శన , హాస్పిటల్ చికిత్సలు ,విద్య వ్యవస్థ మెరుగుపరచడం ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకుని ఇంకా అనేక రకాలుగా మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించుకున్న ఈ పథకం రెండు సంవత్సరాలు గా విజయవంతంగా మహిళా సాధికారత కి ఉపయోగపడుతోందని అన్నారు. బస్సుల్లో ప్రయాణం చేయడమే కాదు.. మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Next Story